Mane Praveen

Apr 21 2024, 19:32

NLG: నామినేషన్ ర్యాలీ మరియు సభను విజయవంతం చేయాలి: గుమ్ముల మోహన్ రెడ్డి

ఈనెల 24న జరిగే నల్లగొండ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా, నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్గొండ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య పాల్గొని ప్రసంగించి కార్యకర్తలు మరియు ప్రజలు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీపీ మనిమద్ది సుమన్,తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనుప రెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు , మాజీ సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 21 2024, 18:29

NLG: సాగర్ జలాశయంలో రోజురోజుకు పడిపోతున్న నీటి నిల్వలు

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఈ రోజు సమాచారం మేరకు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 507.30 అడుగులు ఉంది.

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీ లకు గాను 127.13 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

అవుట్ ఫ్లో 6398 క్యూసెక్కులు ఉంది. కాగా ఇన్ ఫ్లో లేదు. గత సంవత్సరం ఇదే సమయంలో 523. 70 అడుగులు, 156.10 టీఎంసీల నీటి నిల్వ ఉంది

SB NEWS TELANGANA

SB NEWS NLG

STREETBUZZ NEWS

.

Mane Praveen

Apr 21 2024, 08:12

సరంపేట లో చలివేంద్రం ఏర్పాటు

నల్లగొండ జిల్లా:

మర్రిగూడెం మండలం సరంపేట గ్రామంలో, శ్రీ మహలక్ష్మి మీసేవ కోడల వెంకట్ రెడ్డి మరియు గ్రామ ప్రజల సహకారంతో మర్రిగూడ మండల ప్రజా గొంతుక రిపోర్టర్ నక్క సిరియాళ ఆధ్వర్యంలో, శనివారం సరంపేట ప్రధానోపాధ్యాయులు చింత శ్రీనివాసులు తో చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా సిరియాళ మాట్లాడుతూ.. మీసేవ వెంకట్ రెడ్డికి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు కు, గ్రామ ప్రజలకు ధన్యవాదాలు అని తెలిపారు. ఇలాంటి ప్రజాసేవ కార్యక్రమాలకు మరికొంతమంది ముందుకు రావాలని కోరారు.

SB NEWS NLG

STREETBUZZ NEWS NALGONDA DIST

Mane Praveen

Apr 20 2024, 12:59

బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధిగా మచ్చ వివాకర్ రెడ్డి

బీజేవైయం యాదాద్రి భువనగిరి జిల్లా అధికార ప్రతినిధిగా, గుండాల మండలం నూనెగూడెం గ్రామానికి చెందిన మచ్చ వివాకర్ రెడ్డి నియమితులయ్యారు.

ఈ మేరకు బీజేపీ జిల్లా కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. మచ్చ వివాకర్ రెడ్డి భువనగిరి కేబిఆర్ కాలేజీ లో బీటెక్‌ పూర్తిచేశారు. అనంతరం హైదరాబాద్ హైటెక్ సిటీలో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు.

ఈ సందర్భంగా వివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని, ఈ పదవి తనపై మరింత బాధ్యతను పెంచిందని అన్నారు.

Mane Praveen

Apr 19 2024, 15:18

కాంగ్రెస్ పార్టీలో చేరిన జడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడెం మండల జడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, శుక్రవారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీని నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఆయన అనుచర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరో 400 మంది కాంగ్రెస్ లో చేరినట్లు సమాచారం. దీంతో మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలాన్ని సమకూర్చుకున్నట్లుగా తెలుస్తోంది. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

.

Mane Praveen

Apr 18 2024, 22:32

NLG: ఫుడ్ పాయిజన్ కు బలైన విద్యార్థి మరణాన్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి: దళిత రత్న బుర్రి వెంకన్న

భువనగిరి గురుకులాల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఇటీవల హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడి ప్రాణాలను కోల్పోయిన ఆరవ తరగతి విద్యార్థి ప్రశాంత్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి న్యాయం చేయాలని ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ పక్షాన ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న బుర్రి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆయన మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో కూలినాలి చేసుకుని జీవనం కొనసాగిస్తున్నటువంటి వారి పిల్లలే గురుకులాలలో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అటువంటి విద్యార్థులకు ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం, ఏ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయినా కూడా విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అట్టడుగు వర్గాల నుంచి బీద కుటుంబాలైనటువంటి వారి పిల్లలే ఈ హాస్టల్లో అధిక శాతం ఉంటారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే తమ పిల్లలను హాస్టల్లో ఉంచాలా లేకపోతే ఇంటికి తీసుకెళ్లాలా అని అయోమయ పరిస్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ, పూర్తిస్థాయిలో తెలంగాణ హైకోర్టు సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, చనిపోయిన చిన్న లచ్చి ప్రశాంత్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా ప్రశాంత్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలని, ప్రశాంత్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, మరణానికి కారణమైన సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని, ప్రభుత్వం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రక్షాళన చేయాలని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ పక్షాన ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Mane Praveen

Apr 18 2024, 22:09

పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి జహంగీర్ ను గెలిపించండి: ధనుంజయ గౌడ్

చండూరు: పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నియోజవర్గం నుండి సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. గురువారం నేర్మట గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వీర తెలంగాణ సాయుధ రైతంగ పోరాటానికి కేంద్ర బిందువైన భువనగిరి నియోజకవర్గం నుండి పార్లమెంటులో ఎర్రజెండా ప్రాతినిథ్యం ఉండేలా చూడాలన్నారు. 

ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ నాయకులు ఈరటి వెంకన్న, నారపాక శంకరయ్య, బొమ్మరగోని యాదయ్య, బల్లెం స్వామి, బురుకల అంజయ్య గౌడ్, లక్ష్మమ్మ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 18 2024, 21:53

ఈనెల 21 న నల్గొండలో ఉమ్మడి జిల్లా పురుషుల ఫుట్బాల్ జట్టు ఎంపిక ప్రక్రియ

ఈనెల 27 నుండి 30 తేదీ వరకు కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో 10వ రాష్ట్రస్థాయి పురుషుల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించనున్నారు.

దానికి అనుగుణంగా ఈనెల 21వ తేదీ ఆదివారం నాడు నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఉమ్మడి నల్గొండ జిల్లా పురుషుల ఫుట్బాల్ జట్టు ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నామని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అధ్యక్షులు బండారు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు.

సెలక్షన్ ప్రక్రియలో పాల్గొనదలచిన ఉమ్మడి జిల్లాకు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఒరిజినల్ ఆధార్ కార్డు మరియు జనన ధ్రువీకరణ (బర్త్ సర్టిఫికెట్) పత్రం తో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 9492572900 సెల్ నెంబర్ ను సంప్రదించాలని సూచించారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

Apr 18 2024, 20:28

ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ బంపర్ ఆఫర్

దేశంలోని యువతను ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్ర‌త్యేక ప్ర‌చార కార్య‌క్ర‌మం చేపట్టింది.

ఈ నేపథ్యంలో 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు విమాన టికెట్ల‌పై 19 శాతం రాయితీ ఇచ్చింది.

ఈ టికెట్ల‌ తో ఏప్రిల్ 18 నుంచి జూన్ 1 మధ్య ప్ర‌యాణించే వెసులుబాటు కల్పించింది.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

Mane Praveen

Apr 18 2024, 21:06

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కుంభం కృష్ణారెడ్డి

నాంపల్లి: మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, గ్రామ మాజీ సర్పంచ్ కుంభం విజయ కృష్ణారెడ్డి బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి, అతని ముఖ్య కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలోకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం చేరారు.

అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలో వచ్చిన తదుపరి సంక్షేమ పథకాలను చూసి ఆకర్షతులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లోకి కుంభం కృష్ణారెడ్డి ని సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, నాంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య ఎరెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, శీలం జగన్మోహన్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, పానుగంటి వెంకన్న, తిప్పనీ ఎల్లారెడ్డి, కోరే కిషన్, పానుగంటి వెంకటయ్య, గౌరారం కృష్ణారెడ్డి, పంతు నాయక్, సుధాకర్ రెడ్డి, దీప్లా నాయక్, రవి నాయక్, ఈదశేఖర్, దేవత్ పల్లి యాదయ్య, కొండల్, నా రోజు సైదాచారి, కోరే శివ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG